ఎస్.జె.సూర్య దర్శకత్వంలో పవన్ హీరోగా శరత్‌మరార్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందించాలని భావించారు. కానీ ఈ ప్రాజెక్ట్ నుండి సూర్య అర్ధాంతరంగా తప్పుకున్నారు. దాంతో ఈ చిత్రానికి దర్శకుడిగా 'గోపాల గోపాల' దర్శకుడు డాలీని పవన్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు.దీంతో ఈ కథని టేకోవర్ చేసిన డాలీ ఈ చిత్రం స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. అయితే డాలీ చేస్తున్న మార్పులు చేర్పులు పవన్‌ను ఆకట్టుకోలేకపోతున్నాయని సమాచారం. దీంతో ఈ చిత్రం నుండి డాలీని కూడా తొలగించాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చితం షూటింగ్ జులై 2 నుండి పొలాచ్చిలో ప్లాన్‌చేశారు. కానీ ఆ షెడ్యూల్‌ను పవన్ రద్దు చేశాడు. ప్రస్తుతం పవన్ రాజకీయమీటింగ్‌లలో బిజీగా ఉన్నాడు. త్వరలో ఆయన లండన్ వెళ్లనున్నాడు. దాంతో డాలీ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్‌తో ముందుకు సాగాలని పవన్ భావిస్తున్నాడట. తన విదేశీ పర్యటన ముగిసేలోపే పక్కా స్క్రిప్ట్‌ను రెడీ చేయమని ఆయన త్రివిక్రమ్‌కు చెప్పాడని టాక్. పవన్ విదేశాల నుండి రాగానే ఆ స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ పవన్‌కు నేరెట్ చేస్తాడని సమాచారం. రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ నుండి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.ఇది నిజమైన సమాచారమా? లేక రూమరా? అనేది తేలాల్సివుంది.