తన రెండో చిత్రంతోనే రామ్‌చరణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందిన దర్శకుడు సంపత్‌నంది 'రచ్చ' చిత్రాన్ని కమర్షియల్‌గా వర్కౌట్ చేశాడు. కానీ ఆ తర్వాత పవన్ కోసం వేచిచూసి చూసి విసిగిపోయాడు. దాంతో రవితేజతో 'బెంగాల్‌టైగర్' తీశాడు. అయితే సంపత్‌నందికి మరో అవకాశం ఇస్తానని చరణ్ మాట ఇచ్చాడట. దాంతో ఆయన కోసం ఓ కథను సిద్దం చేసి 'చోటామేస్త్రీ' అనే టైటిల్‌ను కూడా రిజిష్టర్ చేశాడు సంపత్‌నంది. కానీ ఆయనకు కనుచూపు మేరలో రామ్‌చరణ్ డేట్స్ లభించే అవకాశాలుకనిపించడంలేదు. చరణ్ కూడా చేద్దాం..చేద్దాం.. అంటున్నాడే కానీ మాట మాత్రం ఇవ్వడం లేదు. దీంతో చరణ్ కోసం తయారుచేసిన స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇదే కథను గోపీచంద్‌కు వినిపించి గ్రీన్‌సిగ్నల్ పొందాడట సంపత్ నంది. మరి గోపీచంద్‌తో సంపత్‌నంది చేయబోయే చిత్రాన్ని భారీ హిట్ చేస్తేగానీ సంపత్‌కు చరణ్ డేట్స్ లభించే అవకాశం లేదు. మరి సంపత్‌కు అంత సీన్ ఉందా? ఆయన గోపీతో చేయబోయే చిత్రం ఎలా ఉంటుంది? సంపత్ దశ తిరుగుతుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.