చంద్రబాబు తమ ఏపీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని చైనా వ్యాపార దిగ్గజాలతో మాట్లాడి వారిని అందుకు ఒప్పించడంలో కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. సాధారణంగా చైనా సంస్ధలు ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టవు. ఏవో ఒకటి అరా పెట్టినా అవి కేవలం నామమాత్రమే. అయితే చైనా ప్రతినిధులను ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు బుద్దుడి సెంటిమెంట్‌ను బాగా ఉపయోగించాడని సమాచారం. చైనాలో 90శాతం మంది బౌద్దమతస్తులు ఉన్నారు. ప్రాచీన బౌద్దచరిత్ర కలిగిన అమరావతి అంటే చైనా వారికి కూడా మక్కువ ఎక్కువ. తమ రాజధాని అదేనని, అక్కడ బౌద్దులకు సంబంధించిన పలు ఆనవాళ్లు ఉన్నాయని, అలాగే తమ రాజధాని అమరావతిలో పెద్ద బౌద్ద విగ్రహం ఉందని, బౌద్దులను ఏపీ ప్రజలు కూడా కొలుస్తారని చంద్రబాబు అక్కడి వ్యాపారవేత్తలకు అర్ధమయ్యేలా చెప్పి, చైనా వారు అమరావతిలో పెట్టబడులను పెట్టడానికి ఆసక్తి చూపేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యాడని అంటున్నారు.