Advertisementt

బాలయ్య కూడా అలెర్ట్ గానే వున్నాడు!

Sun 03rd Jul 2016 05:04 PM
balakrishna,gautamiputra satakarni,anil raavipudi,boyapati srinu,krishna vamsi,balayya directors  బాలయ్య కూడా అలెర్ట్ గానే వున్నాడు!
బాలయ్య కూడా అలెర్ట్ గానే వున్నాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ క్రిష్‌ దర్శకత్వంలో తన వందో చిత్రంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించడానికి వేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. వందో చిత్రం తర్వాత బాలయ్య కృష్ణవంశీ దర్శకత్వంలో 'రైతు బిడ్డ' అనే చిత్రంలో నటించనున్నాడు. అలాగే తనకు 'సింహా, లెజెండ్‌' వంటి బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన పక్కా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ ఈ చిత్రం ప్రారంభానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 'కత్తి' రీమేక్‌ తర్వాత చిరు నటించే 101వ చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్వకత్వం వహించనున్నాడు. అందువల్ల బాలకృష్ణ తన 100వ చిత్రంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత 101 వ చిత్రంగా కృష్ణవంశీ చిత్రం. ఆ తర్వాత 102వ చిత్రంగా అనిల్‌రావిపూడికి అవకాశం ఇస్తూ 'రామారావుగారు' అనే చిత్రం చేయనున్నాడు. చిరుతో బోయపాటి శ్రీను చిత్రం పూర్తయిన తర్వాత బోయపాటితో సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు.మొత్తానికి బాలయ్య వంటి సీనియర్‌స్టార్‌ను అనిల్‌ రావిపూడి ఏవిధంగా హ్యాండిల్‌ చేస్తాడో తెలియదు కానీ..చిత్రాల ఎన్నికలో మాత్రం బాలయ్య చాలా అలెర్ట్ అయ్యాడని మాత్రం చెప్పుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ