తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత నెంబర్ టు ఎవరు? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ స్దానం కోసం కేసీఆర్ తనయుడు కేటీఆర్‌తో హరీష్‌రావు తలపడుతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ తన తర్వాత అతి ముఖ్యమైన శాఖలు, పెత్తనం కేటీఆర్‌కే ఇచ్చాడు. దీంతో కేసీఆర్ కేటీఆర్ వైపే చూస్తున్నాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇటీవల హరీష్‌రావు మాట్లాడుతూ..కేసీఆర్ తనకు అతి ముఖ్యమైన పదవి ఇచ్చాడని, అంతకు మించిన పదవి తనకు అవసరం లేదని వ్యాఖ్యానించాడు. యువరాజుగా కేటీఆర్ పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో హరీష్‌రావు ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయింది. దీంతో కేటీఆర్‌తో పోటీపడే విషయంలో హరీష్ వాస్తవాలను గ్రహించే ఈ ప్రకటన చేశాడని అంటున్నారు. కేసీఆర్ కూడా హరీష్ చేత కావాల్సిన పని చేయించుకుంటూనే ఆయనకు పరోక్షంగా చెక్ పెడుతున్నాడని టిఆర్‌ఎస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి యువరాజు పీఠం కేటీఆర్‌దేే అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు.