హిందీ సీరియళ్లతో ఫేమస్ అయిన నటుడు శరత్ కేల్కర్. ఆయన ప్రతిభను గుర్తించిన పవన్ తన 'సర్దార్ గబ్బర్‌సింగ్'లో పవర్‌ఫుల్ విలన్ పాత్రను ఇచ్చాడు. ఈ చిత్రం ఫ్లాపయినా సరే నటునిగా శరత్‌కేల్కర్‌కు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. దాంతో టాలీవుడ్‌లో పలువురి కన్ను ఆయనపై పడింది. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే శరత్‌కేల్కర్ ప్రతిభను గుర్తించిన పవన్ తన తాజాచిత్రంలో కూడా విలన్‌గా శరత్‌కేల్కర్‌కే అవకాశం ఇచ్చినట్లు సమాచారం. డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మాతగా రూపొందనున్న చిత్రంలో శరత్‌కేల్కర్ నటించనున్నాడు. అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం కనుక హిట్ అయితే శరత్‌కేల్కర్‌కు మరిన్ని మంచి అవకాశాలు వచ్చి, టాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'సర్దార్' చిత్రం ఫ్లాపయినప్పటికీ పవన్ ఏరికోరి తనకు అవకాశం ఇవ్వడంతో ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడట.