Advertisementt

శైలజ ఇచ్చిన సక్సెస్ అలాంటిది మరి!

Sat 02nd Jul 2016 06:00 PM
ram,nenu sailaja,ram next movies list,hero ram directors,karunakaran,kishore,santhosh srinivas,anil ravipudi  శైలజ ఇచ్చిన సక్సెస్ అలాంటిది మరి!
శైలజ ఇచ్చిన సక్సెస్ అలాంటిది మరి!
Advertisement
Ads by CJ

వరుసగా పరాజయాల తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన 'నేను.. శైలజ'తో మరలా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు హీరో రామ్‌. ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ ఇప్పుడు 'నేను..శైలజ' ఇచ్చిన విజయంతో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఆయన ప్రస్తుతం 'కందిరీగ' ఫేమ్‌ సంతోష్‌శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత ఆయన 'పటాస్‌, సుప్రీం' చిత్రాలతో జోరు మీదున్న అనిల్‌ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నాడు. ఆ వెంటనే ఆయన మరలా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో తన రెండో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. మరోవైపు గతంలో రామ్‌తో 'ఎందుకంటే ప్రేమంట' వంటి ఫ్లాప్‌ చిత్రాన్ని తీసిన ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌తో ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సంవత్సరమే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. కరుణాకరన్‌ కంటే ముందు కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. మొత్తం మీద క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టుకుని దూకుడు పెంచుతున్నాడు రామ్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ