త్వరలో కేంద్రంలో మోడీ తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించనున్నాడని తెలుస్తోంది. ఈ మంత్రి వర్గ పునవ్యవస్దీకరణలో ఆయన పలువురు అగ్ర మంత్రులకు స్దానచలనం, లేదా తొలగింపు చర్యలు చేపట్టాలని భావిస్తున్నాడట. వచ్చే ఏడాది గోవా ఎన్నికల సందర్భంగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను తిరిగి గోవాకు పంపే యోచనలో ఉన్నాడు. ఇక ఏపీకి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును మరో శాఖకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక అరుణ్‌జైట్లీని ఆర్దిక శాఖ నుండి రక్షణశాఖకు బదిలీ చేసే యోచనలో మోడీ ఉన్నాడు. అలాగే పీయూష్‌ఘోయల్‌కు ఆర్దికశాఖను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అశోక్‌గజపతిరాజుకు కూడా మరో మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటకకు చెందిన న్యాయశాఖా మంత్రి సదానందగౌడ పనితీరు పట్ల కూడా మోడీ అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. ఏపీ, తెలంగాణలో హైకోర్టు విభజన విషయంలో సరిగ్గా నిర్ణయాలు తీసుకోవపోవడం, అదే సమయంలో కొలీజియం వ్యవస్థను రద్దు చేసే అంశాన్ని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పడంలో సదానంద గౌడ విఫలమయ్యాడని మోడీ భావిస్తుండటంతో మోదీ ఈ చర్యలకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.