మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజకు కళ్యాణ్ అనే వ్యక్తిగా పెళ్లయిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీజతో పాటు మెగాఫ్యామిలీ అంతా చాలా ఆనందంగా ఉంది. అయితే కొత్త అల్లుడు మామగారిని ఏదో ఒక కోరిక కోరడం సహజమే. అదే విధంగా కొత్త అల్లుడు కళ్యాణ్ తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, తనను హీరోగా పరిచయం చేయాలని తన మామగారిని కోరాడట . దానికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అయితే అందుకు ఆయన ఓ షరత్తు పెట్టాడట. ముందుగా యాక్టింగ్ కోర్సులో చేరాలని, దాంతో పాటు ఫిజిక్, బాడీల్వాంగేజ్ వంటి విషయాలపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చాడట. కళ్యాణ్‌కు హీరోగా ఎంట్రీ పెద్ద విషయం ఏమీకాదు. కానీ ఆయన నిలబడాలంటే ఆయనలో టాలెంట్, కృషి వంటివి ఉండాలని, దానినే చిరు తన అల్లుడుకి చెప్పి హితబోధ చేశాడని సమాచారం. మొత్తానికి మెగాఫ్యామీలీ నుండి త్వరలో మరో హీరో వచ్చేది మాత్రం ఖాయమైంది.