Advertisementt

పవన్‌ సక్సెస్‌ అయ్యాడా..?లేదా..?

Fri 01st Jul 2016 09:28 PM
pawan kalyan,tdp and bjp,kapu votes,mudragada issue  పవన్‌ సక్సెస్‌ అయ్యాడా..?లేదా..?
పవన్‌ సక్సెస్‌ అయ్యాడా..?లేదా..?
Advertisement
Ads by CJ

2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ టిడిపి-బిజెపిలకు మద్దతు తెలపడంతో ఆయన సామాజిక వర్గం ఓట్లని ఏకపక్షంగా టిడిపి వశం అయ్యాయి. అదే పవన్‌ మద్దతు తెలుపకుండా ఉంటే జగన్‌కు మరిన్ని సీట్లు వచ్చేవని చెప్పవచ్చు. కానీ పవన్‌ ఎన్నికల్లో టిడిపి కూటమికి మద్దతు తెలిపినా కూడా ఆయన ఎక్కడా కాపువాడు వంటి ట్యాగ్‌ రాకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ తాను కాపువాడినని చెప్పి పవన్‌ ఓట్లు అడగకపోయినా ఆ సామాజికవర్గం వారు మాత్రం పవన్‌ను తమ వాడిగానే భావించి టిడిపి కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ ఆ తర్వాత పవన్‌ ఎప్పుడు కులాల ప్రస్తావన, కాపుల గురించి ఎప్పుడూ ఏకపక్షంగా మాట్లాడలేదు. ఇది చాలా ఇతర కులాలలోని వారిని బాగా ఆకట్టుకుంది. కానీ ఇటీవల జరిగిన పరిణామాల్లో పవన్‌ ముద్రగడకు గానీ మిగిలిన కాపునాయకులకు కానీ మద్దతు ఇవ్వలేదు. దీంతో కాపు సామాజిక వర్గంలో పవన్‌ తమకు మద్దతు ఇవ్వకపోవడంపై సాధారణ కాపు ప్రజలు పవన్‌ మీద గుర్రుగా ఉన్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో పవన్‌ ఎన్నికల్లో నిలబడినా ఆయనకు ఈసారి కాపు ఓట్లు ఏకపక్షంగా పడుతాయని చెప్పలేకపోతున్నారు. ఏదైనా పార్టీతో ఆయన జత కూడినా కూడా పవన్‌ను కాపు ప్రజలు తమ వాడిగా చూడటం లేదన్న మాట వాస్తవం. మరి అందరివాడిగా ఉన్న పవన్‌కు ఈ పరిణామాలు మేలు చేస్తాయా? లేక కాపు ఓట్లు కూడా పోగోట్టుకుని, ఒంటరి వాడుగా నిలబడతాడా? అనేది వేచిచూడాల్సిన విషయం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ