తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాలు చెలరేగుతూ రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రెండు రాష్ట్రాల భారీ నీటిపారుదల శాఖామంత్రులకు ఎక్కడలేని ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ మంత్రి హరీష్‌రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమ ఇప్పుడు ఈ రగడలపై దృష్టిసారించారు. హరీష్‌రావు చాలా సమర్దుమైన మంత్రి. చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకం. ఈ సమావేశాల సందర్భంగా హరీష్ తిరుగులేని వాదన చేసి రివర్‌బోర్డ్ ఆదేశాలను ప్రస్తుతం పక్కనపెట్టి యథాతధ స్దితినే సాగించాలని కేంద్రం తేల్చిచెప్పేలా చేయగలిగాడు. ఈ విషయంలో దేవినేని ఉమ సరిగ్గా ఏపీ వాదనను వినిపించకపోవడంతోనే ఈ సమస్యలో తెలంగాణ.. పై చేయి సాధించిందని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దేవినేని ఈ విషయంలో అద్భుతంగా పనిచేశాడని కితాబు ఇవ్వడం చూస్తుంటే బాబు పొగడ్తలకు నవ్వురాకమానదు.