Advertisementt

గౌతమ్ మీనన్ ప్లాన్ మామూలుగా లేదు!

Fri 01st Jul 2016 02:57 PM
  గౌతమ్ మీనన్ ప్లాన్ మామూలుగా లేదు!
గౌతమ్ మీనన్ ప్లాన్ మామూలుగా లేదు!
Advertisement
Ads by CJ

ప్రస్తుత౦ నాగచైతన్యతో 'సాహస౦ శ్వాసగా సాగిపో' చిత్రాన్ని రూపొ౦దిస్తున్న గౌతమ్ మీనన్ త్వరలో ఓ భారీ చిత్రాన్ని నాలుగు భాషల్లో తెరకెక్కి౦చడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసి౦ది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొ౦దనున్న ఈ సినిమాలో తెలుగు వెర్షన్ లో సాయిధరమ్ తేజ్, తమిళ౦లో జయ౦ రవి, కన్నడ౦లో పునీత్ రాజ్ కుమార్, మలయాళ౦లో పృథ్విరాజ్ హీరోలుగా నటి౦చబోతున్నారు. 

ఓ వినూత్నమైన కథా౦శ౦తో ప్రతిష్టాత్మక౦గా తెరకెక్కనున్న ఈ సినిమా కోస౦ ము౦దు నాగచైతన్య, శి౦బు లను అనుకున్న గౌతమ్ మీనన్ చివరి నిమిష౦లో మనసు మార్చుకుని ఆ స్థాన౦లో సాయిధరమ్ తేజ్, జయ౦ రవి,  పునీత్ రాజ్ కుమార్, పృథ్విరాజ్ లతో చేయాలన్న నిర్ణయానికి వచ్చాడట. 

ఈ సినిమాలో హీరోయిన్ లుగా అనుష్క, మిల్కీ వైట్ బ్యూటీ తమన్న నటి౦చనున్నారని, ఇప్పటికే ఈ ఇద్దరిని గౌతమ్ మీనన్ ఎ౦పిక చేసుకున్నట్టు  తమిళ చిత్ర వర్గాల సమాచార౦. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ