జీవిత కథల ఆధారంగా తెరకెక్కించే సినిమాలలో నటించడంలో అక్షయ్ కుమార్ కి తిరుగే లేదు. ఈ మధ్య వచ్చిన ఎయిర్ లిఫ్ట్ చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓ నేవీ అధికారి నిజ జీవిత కథ తో 'రుస్తుం' సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఒక ట్రైలర్ ని యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో నేవీ అధికారిగా.. పాత్రలో ఒదిగిపోయి నటించేసాడు. ముంబై లో సంచలనం సృష్టించిన నేవల్ కమాండర్ నానావతి లైఫ్ స్టోరీతో ఈ 'రుస్తుం' చిత్రం తెరకెక్కుతుంది. అయితే రీల్ లైఫ్ లో నానావతి తన భార్య ప్రేమికుడిని చంపేసి హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ కథ ఆధారంగా 'రుస్తుం' అనేక మలుపులతో తెరకెక్కుతుంది. మరి రీల్ లైఫ్ లో ఈ సినిమాని ఎలా తీశారనేదే ఆసక్తికర అంశం. ఈ సినిమాలో అక్షయ కుమార్ కి జోడిగా ఇలియానా చేస్తుండగా మరో నటి ఇషా గుప్తా గెస్ట్ రోల్ లో కనిపించనుంది. ఈ సినిమాకి తీను సురేష్ డైరెక్టర్. ఆగస్ట్ 12 న మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.