రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి1' విడుదల సమయంలోనే శంకర్ తన 'ఐ' చిత్రాన్ని తీసుకురావాలని భావించాడు. కానీ ఆ పోరు తప్పింది. చివరకు ఈ పోటీలో రాజమౌళి 'బాహుబలి'నే గెలిచింది. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ - అక్షయ్‌కుమార్‌లు నటిస్తున్న 'రోబో2.0' చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రజనీ అమెరికాలో ఉన్నప్పటికీ ఈ చిత్రం షూటింగ్ మాత్రం వేగంగానే పూర్తి చేస్తున్నాడు శంకర్. దాదాపు 250కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉండే సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి2' చిత్రం షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ ప్రారంభం సయయంలోనే శంకర్ 'రోబో2.0'ను తమిళ నూతన సంవత్సరాది అయిన ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించాడు. మరోవైపు అదే రోజున రావాలని రాజమౌళి కూడా ప్లాన్ చేశాడు. దీంతో ఈ రెండు చిత్రాల మధ్య బిగ్‌ఫైట్ తప్పదని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం శంకర్ కాస్త వెనకడుగు వేశాడు. 'రోబో2.0' చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని భావించిన శంకర్ తన చిత్రాన్ని వచ్చే దీపావళికి పోస్ట్‌పోన్ చేశాడు. మొత్తానికి ఈ చిత్రాల విడుదలలో పోటీ తప్పినా, ఈ రెండింటిలో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునే చిత్రం ఏది? అనే విషయం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది.