Advertisementt

పవన్ కళ్యాణ్, మళ్లీ అదే తలనొప్పి!

Thu 30th Jun 2016 01:02 PM
pawan kalyan,dolly,bobby  పవన్ కళ్యాణ్, మళ్లీ అదే తలనొప్పి!
పవన్ కళ్యాణ్, మళ్లీ అదే తలనొప్పి!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం దర్శకత్వం వహించే ఛాన్స్ దొరికిందంటే దర్శకులు సంబరపడాలో లేక సందేహించాలో అర్థం కాని విచిత్ర పరిస్థితి పరిశ్రమలో నెలకొంది. పవన్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడమే ఓ సుకృతం అనుకునే రోజుల నుండి ఇలా సంశయపడే దుస్థితి ఎందుకు వచ్చిందంటే అందుకు పవన్ కళ్యాణ్ ఒక్కరినే తప్ప ఇంకా వేరెవరిని నిందించడానికి లేదు. 

మొదటగా సర్దార్ గబ్బర్ సింగ్ మొదలయిన నాటి నుండీ సంపత్ నందిని మార్చి బాబీని దర్శకుడిగా పెట్టుకోవడం, అటు తరువాత ఏళ్ల తరబడి షూటింగ్ సాగదీసి ఓ డొక్కు సినిమాను అభిమానుల మొహం మీద కొట్టడంతో పవన్ అంటే దర్శకత్వ శాఖ నుండి ప్రతి శాఖలో వేలు పెట్టి సినిమాను చెడగొడతాడు అన్న భావన అందరిలోనూ, ఆఖరికి అభిమానుల్లోనూ ఎక్కువైంది. 

ఇక మరోసారి ఎస్.జె.సూర్యాను పిలిచి మరి ఛాన్స్ ఇచ్చి కొత్త చిత్రానికి ముహూర్తం పెట్టించిన ఘనత కళ్యాణ్ బాబుదే. తెర వెనక జరిగింది ఏమిటో తెలియకుండానే సుర్యాను సాగనంపి డాలీని డైరెక్టర్ కుర్చీలో కూర్చోపెట్టారు. అక్కడితో అయిందా, స్క్రిప్ట్ పై మళ్లీ పని చేయమని ఇదిగో ఇప్పుడు లండన్ చెక్కేస్తున్నాడు పవన్. అసలు కథ, కథనాలు పక్కన పెట్టేసి, ఎప్పుడో వీలు చిక్కినప్పుడు ఓసారి ప్రాజెక్టు అప్ డేట్ తీసుకునే పవన్ మరోసారి సర్దార్ గబ్బర్ సింగ్ చిత్ర ఫలితాన్ని డాలీకి పునరావృతం చేయకుండా ఉంటాడా అన్న అనుమానం ఫ్యాన్సుని తెగ ఇబ్బంది పెట్టేస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ