టాలీవుడ్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల స్థానం ఏమిటో అందరికి తెలిసిందే. స్వర్గీయ ఎన్టీఆర్, నాగేశ్వరరావు తరం, ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి వారి తరం... ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల తరం సినీ చరిత్రలో కీలకపాత్రలను పోషించారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో కేవలం బాలయ్య, నాగ్, వెంకీలు మాత్రమే కొంతకాలం మిగిలారు. కానీ దాదాపు 9ఏళ్ల తర్వాత మరలా మెగాస్టార్ తన 150వ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వడంతో మరలా ఇప్పుడు నలుగురు స్టార్స్ ఎంతోకాలం తర్వాత షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ వినాయక్ చిత్రంతో బిజీ కాగా, బాలయ్య తన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'తో బిజీగా ఉన్నాడు. ఇక నాగార్జున.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం చేస్తుండగా, వెంకటేష్.. మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం'తో బిజీగా ఉన్నాడు. మొత్తానికి ఈ నలుగురు సీనియర్ స్టార్స్ మరలా తమ షూటింగ్‌లతో బిజీగా ఉండటం, కొన్నాళ్లుగా వారు సినిమాలు చేస్తున్న రాని స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా చిరు ఎంట్రీ తో తిరిగి రావడం..ఆయా హీరోల అభిమానులకే కాదు.. సినీ ప్రియులందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.