ఒకప్పుడు మన స్టార్‌హీరోల చిత్రాలంటే షూటింగ్‌కు ఏడాది పట్టేది. ఏడాదికి వారు ఒక్క సినిమా చేయడమే కష్టమైపోయేది. కానీ వారిలో మార్పు వచ్చిందో లేక కాంపిటీషన్‌ను తట్టుకోవాలంటే మారకతప్పదని గ్రహించారో కానీ ఇప్పుడు మన స్టార్‌హీరోలంందరూ తమ చిత్రాలను ఆరునెలల్లోపే పూర్తి చేయాలని పోటీపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'కత్తి' రీమేక్‌ను ఆరునెలలలోపే పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. పవన్‌కళ్యాణ్ కూడా డాలీతో చేయబోయే చిత్రాన్ని నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికే రావాలనుకుంటున్నాడు. ఎన్టీఆర్‌తో ప్రస్తుతం కొరటాల శివ చేస్తోన్న 'జనతాగ్యారేజ్' షూటింగ్ ప్రారంభించిన ఐదునెలల్లోనే విడుదలకు సిద్దమవుతోంది. వాస్తవానికి చారిత్రాత్మక చిత్రాల షూటింగ్ సహజంగానే లేటవుతుంది. కానీ బాలయ్య నటిస్తున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని కూడా వేగంగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయడానికి క్రిస్ టీం కృతనిశ్చయంతో ఉంది. రామ్‌చరణ్ ప్రస్తుతం నటిస్తోన్న 'ధ్రువ' చిత్రాన్ని ఆరునెలల్లో పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఆ వెంటనే చరణ్ సుకుమార్ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభిస్తాడు. ఈ చిత్రాన్ని నవంబర్ నుండి సెట్స్‌పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది సమ్మర్‌కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సహజంగా షూటింగ్‌కు చాలా ఎక్కువ సమయం తీసుకునే సుకుమార్ ఈ చిత్రం నుండి తన రూట్ మార్చనున్నాడు. ఇక మహేష్-మురుగదాస్‌ల చిత్రాన్ని కూడా పట్టాలెక్కిన ఆరునెలల్లో పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు.