Advertisementt

పవన్‌...రాజకీయంగా ఎదుగుతున్నాడు!

Wed 29th Jun 2016 01:06 PM
pawan kalyan,janasena,pawan kalyan politics,mudragada padmanabham,kaapu issue,silent  పవన్‌...రాజకీయంగా ఎదుగుతున్నాడు!
పవన్‌...రాజకీయంగా ఎదుగుతున్నాడు!
Advertisement
Ads by CJ

రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ప్రతి దానిపై స్పందిస్తూ పోతే దానికి హద్దే ఉండదు. అలా స్పందించడం వల్ల అనవసర విమర్శలు కూడా వస్తుంటాయి. అందుకే రాజకీయాల్లో వ్యూహాత్మక మౌనం చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం పవన్‌ అదే రూట్‌లో ఉన్నాడు. రాబోయే ఒకటి రెండేళ్ల పాటు కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టాలని, ఆ సమయంలో జరిగే పొలిటికల్‌ అప్‌డేట్స్‌ను తెలుసుకుంటూనే ఉండాలి.. కానీ దేనిపై కూడా స్పందించకూడదని, ఇక వచ్చే ఎన్నికలు మొదలయ్యే ఓ ఏడాది ముందు నుండి పొలిటికల్‌గా యాక్టివ్‌ కావాలనేది పవన్‌ ఆలోచనగా తెలుస్తోంది. ఆయన ముద్రగడ దీక్షపై స్పందించకపోవడానికి కారణం కూడా ఇదేనని, తాను మౌనంగా ఉండటమే ఇప్పుడు తనకు మేలు చేసిందని ఆయన వ్యతిరేకులు కూడా ఒప్పుకుంటున్నారు. ప్రతి ఒక్క పొలిటికల్‌ డెవలప్‌మెంట్‌ మీద స్పందించకుండా, తాను పొలిటికల్‌గా యాక్టివ్‌ అయిన తర్వాత మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడితే బాగుంటుందనేది పవన్ వ్యూహం అని అర్ధమవుతోంది. పోనీ ముద్రగడ దీక్షపై స్పందించిన చిరంజీవి, దాసరిలకు ఆ వ్యవహారం మంచి చేయకపోగా, అనవసర విమర్శలకు చోటు ఇచ్చినట్లయింది. చిరుపై అందరివాడు అనే ముద్ర తొలిగి కేవలం కాపులకు సంబంధించిన నాయకుడిగా చెడ్డపేరు వచ్చిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఉదాహరణగా చూపుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ