ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మేన్‌గా, యాంగ్రీ పోలీస్ ఆఫీసర్‌గా ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరో.. రాజశేఖర్. ఆయన నటనకు సాయికుమార్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగులు జోడైతే ఇక సినిమా ఎక్కడికో వెళ్లిపోయేది. దాంతో ఆనాడు కేవలం రాజశేఖర్‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నో పోలీస్ పాత్రలను, కథలను సృష్టించారు. కానీ ఆయన జోరు ఇప్పుడు బాగా తగ్గింది. యువతరం రాకతో రాజశేఖర్ ను ఇప్పుడెవ్వరూ పట్టించుకోవడం లేదు. తాజాగా వైవిధ్య చిత్రాల దర్శకుడు ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా నిర్మితం కానుంది. ఈ స్టోరీని ఆల్‌రెడీ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ రాజశేఖర్‌కు వినిపించడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయింది. త్వరలో ఈ చిత్రం పట్టాలెక్కనుంది. మరి రాజశేఖర్‌ను పోలీస్ ఆఫీసర్‌గా చూడాలనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్‌గా చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ఖాళీ గా ఉంటున్న రాజశేఖర్...ఈ అవకాశంతో మళ్ళీ బిజీ హీరోగా మారాలని ట్రై చేస్తున్నాడు. లేదా విలన్ గా అయినా సరే..చేస్తూ..బిజీగా ఉండాలని కోరుకుంటున్నాడట. అందుకే రెమ్యూనరేషన్ విషయం లో కూడా పెద్దగా అడ్డు చెప్పడం లేదంట.