హీరో నితిన్ నిర్మాతగా తీసిన 'అఖిల్' చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఆయనకు భారీ నష్టాలు వచ్చాయి. దాంతో ఆ సొమ్ము రికవరీ కోసం నితిన్ తాజాగా ఓ మార్గాన్ని ఎంచుకున్నాడు. అది తన పారితోషికాన్ని పెంచడం. ప్రస్తుతం నితిన్ 'అ..ఆ' వంటి విజయంతో మంచి ఊపు మీదున్నాడు. దాంతో తన రెమ్యూనరేషన్‌ను పెంచాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. తన వద్దకు వస్తున్న నిర్మాతలకు నితిన్ ఈ విషయాన్ని చెబుతున్నాడు. పారితోషికం పెంచకతప్పని పరిస్థితిలో తానున్నానని, కాబట్టి ఈ విషయంలో నిర్మాతలు సహకరించాల్సిందిగా నితిన్ ప్రతిపాదనలు చేస్తున్నాడు. వాస్తవానికి హిట్స్‌లో ఉన్నప్పుడు పారితోషికం పెంచడం సాధారణమైన విషయమే. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఫ్లాప్‌లో ఉన్నప్పుడు డిస్కౌంట్లు ఇవ్వడం, హిట్స్‌లో ఉన్నప్పుడు పారితోషికం పెంచడం సహజమైన విషయమే. అందులోనూ నితిన్ తన ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసే హీరో కాదు. ఆయన నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయనకు నిర్మాతల, బయ్యర్ల బాధలు అన్ని తెలుసు. సో... ఇక నుండి నితిన్‌తో సినిమా చేయాలనుకునే వారు కాస్త ఎక్కువమొత్తం ఆయనకు ఇవ్వడానికి రెడీగా ఉంటే మంచిది.