ప్రతిపక్షనాయకుడు వైఎస్‌జగన్‌కు చెందిన సాక్షి మీడియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతూ సతమతమవుతున్నట్లు సమాచారం. తనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా అనవసర ఆరోపణలు చేస్తూ తనను ప్రజల్లో విలన్‌గా చిత్రీకరిస్తున్న జగన్ మీడియాను ఎలా కట్టడి చేయాలో బాబుకు అర్ధం కావడం లేదు. మీడియా మీద ఉక్కుపాదం మోపాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ అనవసరంగా మీడియాతో తగువు పెట్టుకొని కక్ష్యసాధింపు చర్యలు తీసుకుంటే తనకు మరింత చెడ్డపేరు రావడంతోపాటు జగన్‌కు పొలిటికల్ మైలేజీ పెరుగుతుందని భావిస్తున్నాడు. అలా అని వదిలేస్తే మీడియా నిండా తనపై లేనిపోని ఆరోపణలు చేసి తనను మరింతగా ఇబ్బందిపెడుతుండటంతో బాబుకు ఏమీ పాలుపోవడం లేదు. వైఎస్‌లాగానో లేక కేసీఆర్‌లాగానో తన వ్యతిరేక మీడియా మీదే దూకుడుగా వ్యవహించడం బాబుకు చేతకావడం లేదనే విషయం అర్దం అవుతోంది. నేడు కేసీఆర్ అంటే తెలంగాణలోని మీడియాకు ముచ్చెమటలు పోస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, చూపడం చేయలేకపోతున్నారు. ఒక నియంతలా కేసీఆర్ మీడియాను భయపెట్టి మరీ తన దారికి తెచ్చుకున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నాడని మీడియా వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి.