ప్రస్తుతం మీడియాలో ఇది హాట్‌టాపిక్ అయింది. పవన్‌కళ్యాన్ ఇప్పటికే బాలీవుడ్‌లో వచ్చిన 'ఓ మైగాడ్' చిత్రం తెలుగు రీమేక్ 'గోపాలా..గోపాలా.' చిత్రంలో మోడ్రన్ కృష్ణుడిలా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే చిత్రంలో కూడా దేవుడి పాత్రను చేస్తున్నాడని ప్రచారం మొదలైంది. 'ఖలేజా' చిత్రంలో మహేష్‌ను దేవుడిలా చూపించిన త్రివిక్రమ్ పవన్‌తో చేయబోయే చిత్రంలో కూడా ఆయన్ను దేవుడిలా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.దీనికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్‌ను కూడా పెట్టినట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కానీ ఇది కేవలం పుకారే అని, పవన్‌తో త్రివిక్రమ్ చేయబోయే చిత్రం విషయంలో వస్తున్న ఈ రూమర్స్ అన్నీ ఆయన అభిమానులు సృష్టించినవే అని స్పష్టంగా అర్దమవుతోంది. తమకు తాము ఓ క్యారెక్టర్‌ను అనుకొని,దానికి ఓ టైటిల్ కూడా తగిలించి.. ఈ పుకార్లు షికారు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉండీ అనేది ఆ దేవుడు దిగివస్తేనే తెలుస్తుంది.