Advertisementt

ఇది నిజమేనా..? చిరుకు జోడీ ఆమేనా?

Mon 27th Jun 2016 08:14 PM
mega star,chiranjeevi,150th movie heroine,nargis fakhri,vinayak  ఇది నిజమేనా..? చిరుకు జోడీ ఆమేనా?
ఇది నిజమేనా..? చిరుకు జోడీ ఆమేనా?
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'కత్తి' రీమేక్‌ షూటింగ్‌ మొదలైన సంగతి తెలిసిందే. మొదటిరోజు షూటింగ్‌ స్పాట్‌లో చిరును చూసిన వారెవ్వరూ ఆయనకు 60ఏళ్లంటే నమ్మలేని విధంగా ఉన్నాడు. 40ఏళ్ల వాడిగా కనిపిస్తున్నాడు.కాగా ఈచిత్రానికి హీరోయిన్‌ ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. అనుష్క, నయనతారలను అనుకున్నప్పటికీ వారితో వర్కౌట్‌ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా ఓ వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ హాట్‌బ్యూటీ నర్గీస్‌ ఫక్రీతో ఈ చిత్ర దర్శకుడు వినాయక్‌ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరు పక్కన ఆమె అయితేనే సూట్‌ అవుతుందని వినాయక్‌ భావిస్తున్నాడట. కాగా ఈచిత్రంలో హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం ఉండదు. కేవలం గ్లామర్‌షో కోసమే ఓ హీరోయిన్‌ కావాలి. దాంతో నర్గీస్‌ అయితే బాగుంటుందని, గ్లామర్‌షో కూడా ఆమెతో అయితేనే వర్కౌట్‌ అవుతుందని భావిస్తున్నారట. సెక్స్‌బాంబ్‌గా పేరొందిన ఆమెను పెట్టుకుంటే చిరు ఇమేజ్‌కు ఏమైనా దెబ్బతగులుతుందా? అనే చర్చ సాగుతోంది. సో..కొన్ని రోజులైతేనే గానీ ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ