Advertisementt

తెలిసే అడుగు పెట్టావా అమ్మాయ్!

Mon 27th Jun 2016 08:08 PM
niharika,oka manasu  తెలిసే అడుగు పెట్టావా అమ్మాయ్!
తెలిసే అడుగు పెట్టావా అమ్మాయ్!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా హీరోయిన్ అంటే ఓ ప్రామాణికమైన కొలత ఉంది. గ్లామరసం పండాలి, స్కిన్ షో చేయాలి, నటన వచ్చినా  రానట్టే ఉండాలి, అవసరమైతే మూతి ముద్దులు వగైరాలకి సిధ్ధమవ్వాలి. సక్సెస్ సాధించిన టాప్ హీరోయిన్ల కష్టం వెనకాల ఇలా ఓ చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఇవన్నీ తెలిసే దిగిందో లేక తెలీకుండా అడుగేసిందో గానీ కొణిదెల నిహారిక మాత్రం మొదటి అడుగు తెలివిగా పై పట్టికలో చెప్పిన ఎటువంటి మసాలాలు లేని ఒక మనసుతో ఆరంగేట్రం చేసింది. సినిమాకు మొదటి షో నుండే ఎవరో నూరి పోస్తున్నట్టుగా నెగెటివ్ టాక్ విస్తరించడం మొదలయింది. నిహారిక తన సంధ్య పాత్రకు పూర్తి న్యాయం చేసినా, దర్శకుడు రామరాజు మరీ పేవలంగా, నిదానంగా కథనాన్ని నడిపించడం మొదటికే మోసం తెచ్చింది. నిహారికకు బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, విద్య బాలన్ లాంటి నటీమణుల లాగా హీరోయిన్ సెంట్రిక్ కథల్లో వెలిగి పోవాలన్న ఆశ, తపన ఉండొచ్చూ...  బట్ ఇది టాలీవుడ్ అమ్మాయ్... ఇక్కడ లెక్కలన్నీ వేరేగా ఉంటాయి. ఇవన్నీ తెలిసే కాలు మోపానంటే, రాబోయే రోజుల్లో నీ సినిమాలు హిట్ అయితే గనక... తమరు ఓ కొత్త చరిత్ర లిఖించినట్టే!

Tags:   NIHARIKA, OKA MANASU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ