Advertisementt

హీరో కూతురు పెళ్లి కూతురవనుంది!

Mon 27th Jun 2016 01:04 PM
vikram,vikram daughter marriage,akshita  హీరో కూతురు పెళ్లి కూతురవనుంది!
హీరో కూతురు పెళ్లి కూతురవనుంది!
Advertisement
Ads by CJ

దక్షిణాది చలన చిత్రం రంగంలో విలక్షణ నటుడిగా పేరు పొందిన చియాన్ విక్రమ్ బయటికి కుర్రాడిగా కనపడినా ఆయన వయసు మాత్రం 50 పై బడే ఉంటుంది. విషయం ఏమిటంటే అతనికి పెళ్లీడుకు వఛ్చిన ఓ కూతురు, కాలేజీలో చదువుకునే వయసులో ఉన్న ఓ కొడుకు ఉన్నారు. సినిమా కోసం అహర్నిశలు కష్టపడే తత్వం ఉన్న విక్రమ్, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటుంటారు. ఇదిగో ప్రస్తుతానికి విక్రమ్ తన కూతురు అక్షిత పెళ్లి నిశ్చితార్థ పనుల్లో బిజీగా ఉన్నారట. పెళ్లి కొడుకు పేరు మను రంజిత్. చెన్నై పట్టణానికి చెందిన CK బేకరీ రంగనాథన్ అనే వ్యాపారవేత్త కొడుకైన మను రంజిత్, అక్షితల వివాహ నిశ్చితార్థ మహోత్సవం జులై 10న ఓ స్టార్ హోటల్లో వైభవంగా జరగనుంది. ఎటువంటి హడావిడి, మీడియా దృష్టి పడకుండా ఈవెంట్ జరపాలని, ఇరు వైపులా బంధువులు తప్ప పెద్దగా ఆహ్వానితులు ఉండబోరని సమాచారం. పెళ్లి సుమారుగా వచ్ఛే ఏడాదిలో జరగొచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ