Advertisementt

రవిబాబు అండ్ పంది పిల్ల

Sun 26th Jun 2016 05:51 PM
ravi babu,piglet,ravi babu movie  రవిబాబు అండ్ పంది పిల్ల
రవిబాబు అండ్ పంది పిల్ల
Advertisement
Ads by CJ

కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ... హీనంగా చూడకు దేన్ని అని శ్రీశ్రీ ఆనాడు అంటే కుక్క పిల్లను తీసేసి పంది పిల్లను జత చేసి... హీనంగా చూడకు దేన్ని అన్నీ కథా వస్తువులేనోయ్ అంటున్నాడు మన విలక్షణ దర్శకుడు రవిబాబు. నిజమే మరి, స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయి తనకి ఉన్నా ఇంకా చోట మోటా హీరోలతోనే కంఫర్ట్ ఫీలవుతూ అడపా దడపా మెరుపులు మెరిపిస్తున్న రవిబాబు మనకెవరికీ చెప్పకుండా పంది పిల్లను ప్రధాన హీరోగా పెట్టేసి ఓ సినిమాను పూర్తి చేసేసాడు. రాజమౌళి ఈగను పెట్టగా లేనిది నేను పందిని పెడితే ఏంటి అనుకున్నాడో ఏమో గానీ షూటింగ్ మొత్త్తం పూర్తి చేసి పడేసాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అభిషేక్, నాభ హీరో హీరోయిన్లుగా చేసినా పంది పిల్ల మీదే కథ సాంతం రన్ అవడం ఇక్కడ విశిష్టిత. విదేశాల నుండి ఎనిమాట్రానిక్స్ టెక్నాలజీని కోట్లాది డబ్బులు పోసి ఇంపోర్ట్ చేసుకోలేని నిర్మాతకు అనుగుణంగా సొంత టెక్నాలజీని డిజైన్ చేసి, నిజమైన పంది పిల్లతో కొన్ని సీన్లు... టెక్నాలజీని వాడుకొని ఇంకొన్ని దృశ్యాలు జతచేసి అద్భుతమైన ఔట్ పుట్ తీసుకొచ్చాడు రవిబాబు. ఈ చిత్రానికి హాలీవుడ్ నుండీ కానీ ఏ వుడ్ నుండీ ఎటువంటి రెఫరెన్సులు లేకపోవడం మరో ఛాలెంజ్. అందుకే పంది పిల్ల కోసం ఓర్పుతో ఏడాదిన్నర కష్టపడ్డాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ