కమెడియన్ స్థాయి నుండి ఈ రోజు ఓ హీరోగా మన ముందు నిలబడిన సునీల్ నుండి వస్తున్న కొత్థ చిత్రం జక్కన్న. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ, నిర్మాత సుదర్శన్ రెడ్డి ఈ జక్కన్నని ఎంతలా చెక్కారో తెలీదు గానీ సునీల్ మాత్రం హీరోగానే కాకుండా అన్ని రకాలుగా తన వంతు కృషిని అందజేశాడు. మెగాస్టార్ చిరంజీవిగారిని మొహమాట పెట్టి మరీ నిన్న జరిగిన ఆడియో ఫంక్షనుకు రప్పించడం ఒకటే కాదు, జక్కన్న కథ, కథనాల్లో సైతం సునీల్ హస్తం ఉందన్న సంగతి నిర్మాత సుదర్శన్ రెడ్డి గారే తన ప్రసంగంలో నిన్న ఒప్పేసుకున్నారు. జక్కన్నలో మరింత కామెడీని, ఎమోషనుని జత చేసేందుకు కొంతమంది రచయితలను సునీల్ తన సొంత ఖర్చులతో హైర్ చేసుకొని, స్క్రిప్ట్ మీద పని చేయించారు అంటేనే అతడి తాపత్రేయం మనకు అర్థమవ్వాలి. గత కొంత కాలంగా సునీల్ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటున్నాడు. భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి అందరికీ తీరని బాధలను, నష్టాలను మిగిల్చాయి. ఈ సమయంలో జక్కన్న కూడా తేడా కొట్టేస్తే సునీల్ కెరీర్ సుడిగుండాల్లో పడినట్లే. రానున్న విపత్త్తును ముందుగానే కనిపెట్టినాడు కాబట్టే చిత్రం కోసం ఇంతలా ఆరాట పడుతున్నాడు. పోనీలే అతని కష్టానికి తగిన ఫలితం దక్కి జక్కన్న హిట్టయితే అంతా హ్యాపీస్.