Advertisementt

తెల్లవారు జామున ముహూర్తం పెట్టేసారు!

Sun 26th Jun 2016 01:48 PM
krish,dr ramya,wedding,engagement  తెల్లవారు జామున ముహూర్తం పెట్టేసారు!
తెల్లవారు జామున ముహూర్తం పెట్టేసారు!
Advertisement
Ads by CJ

వయసు పైబడినట్లుగా కనపడే విలక్షణ దర్శకుడు క్రిష్ తొందరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. డాక్టర్ రమ్యతో ఈయనగారి వివాహం కుదిరిందన్న సంగతి మనకు ముందే తెలిసినా లగ్న ముహూర్తం, నిశ్చితార్థం తదితర అంశాల మీద అంతలా క్లారిటీ రాలేదు. ఇదుగో ఈరోజే మాదాపూర్ లోని ఓ స్టార్ హోటల్లో దగ్గరి బంధువులు, స్నేహితుల సమక్షంలో క్రిష్, రమ్యల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. అంతే కాదు ఆగస్టు ఎనిమిదిన తెల్లవారు జామున 2.28కి హైద్రాబాద్ నగరంలోనే మ్యారేజ్ జరగనుంది. ఈరోజు కార్యక్రమానికి విచ్ఛేసిన ముఖ్య అతిథుల్లో బాలకృష్ణ, రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్ తదితరులు ఉన్నారు. ఆగస్టులో పెళ్లి ముహూర్తం పెట్టేసారు గనక బాలయ్య వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగుకి కాసిన్ని రోజులు బ్రేక్ పడే ఆస్కారం ఉంది. ఏదేమైనా తొందరలోనే వివాహబంధంతో ఒక్కటవబోతున్న క్రిష్, రమ్యాలకు సినీ జోష్ తరఫున అడ్వాన్సు విషెస్. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ