తమిళ 'కత్తి' చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నాడని తెలిసి, ఆ భాష రాకపోయినా ఆ సినిమా సీడీలు తెచ్చి మరీ ఎగబడి చూశారు మనవాళ్లు. హీరో పాత్రకు చిరును అనుకోగానే ఆయన పక్కన మెయిన్‌గా కనిపించే సతీష్ పాత్రను ఎవరు చేస్తారా? అనే సంశయం మొదలైంది అభిమానుల్లో. హీరోయిన్ కన్నా ఈ పాత్రపైకే అందరి దృష్టి మరలింది. తమిళంలో అప్‌కమింగ్ కమెడియన్ సతీష్ ఆ పాత్రను చేశాడు. 'కత్తి' తర్వాత సతీష్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎందుకంటే 'కత్తి'లో సతీష్ చేసింది చిన్న పాత్ర కాదు. హీరో విజయ్ తర్వాత, హీరోయిన్ సమంత కంటే ఎక్కువ లెంగ్త్ ఉన్న పాత్ర అది. మరి అంత ఇంపార్టెంట్ పాత్ర అందునా చిరు పక్కన ఎవరా? అనే సంశయం అందరికీ కలిగింది. మొదట ఈ పాత్ర చేయడానికి సునీల్ ఒప్పుకున్నాడు. కానీ సినిమా ప్రారంభం కావడం లేటు కావడంతో ఈ సినిమాకు సునీల్ డేట్స్ అడ్జస్ట్ కాలేదు. ఆ తర్వాత వెన్నెల కిషోర్ అనుకున్నారు. కానీ షూటింగ్ మొదటి రోజు చిత్రీకరణలో చిరుతో పాటు అలీ కనిపించాడు. దాంతో అలియే సతీష్ పాత్రను చేస్తున్నాడని అందరూ ఫిక్స్ అయ్యారు. అలీ చేస్తున్నది అదే పాత్రా? లేక తెలుగు వెర్షన్‌కు చేసిన మార్పులు చేర్పులు నేపథ్యంలో అలీది వేరే పాత్రా? అనేది సస్పెన్స్‌గా మారింది.