Advertisementt

అసలు రజినీకాంత్ కి ఏమైంది...?

Sat 25th Jun 2016 08:15 PM
rajinikanth,kabali,kidney problem,america,kabali audio launch  అసలు రజినీకాంత్ కి ఏమైంది...?
అసలు రజినీకాంత్ కి ఏమైంది...?
Advertisement
Ads by CJ

రజినీకాంత్ కి ఆరోగ్యం బాగోలేక ఆయన అమెరికాలో రహస్యం గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని మీడియా కోడై కూస్తుంది. కానీ రజినీకాంత్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తూ ఎటువంటి స్టేట్ మెంట్స్ ఇవ్వలేదు. ఆయన తన ఫ్యామిలీతో అమెరికా ట్రిప్ లో వున్నారని చెబుతున్నప్పటికీ..  ఆయన మీద రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తుంది. అయితే రజినీకాంత్ కి హాలీడే ట్రిప్ కి వెళ్లే అలవాటు లేదని, అసలు ఆయన ఆరోగ్యం బాగోలేదని చికిత్స కోసమే ఆయన అమెరికా వెళ్లారని... కిడ్నీ మార్పిడికోసమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా అమెరికా లోని ఒక ప్రవేట్ హాస్పిటల్ లో ఈ కిడ్నీ ఆపరేషన్ జరుగు తుందనే న్యూస్ బయటికి వచ్చింది. ఈ వార్త విన్న రజిని అభిమానులు షాక్ అయ్యారు. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత ఉందనేది తెలీదు.  అయితే ఈ విషయం లో కబాలి టీమ్ కూడా పెదవి విప్పడం లేదు. తమిళం లో కబాలి  ఆడియోని రజినీకాంత్ లేకుండా ఆయన డాటర్ చేతుల మీదుగా చాలా సింపుల్ గా చేసేసారు. కానీ తెలుగు ఆడియో ని మాత్రం హైద్రాబాద్ లో చాలా గ్రాండ్ గా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు తెలుగు నిర్మాతలు. ఇన్ని జరుగుతున్న రజినీకాంత్ జాడ మాత్రం లేదు. కబాలి చిత్రాన్ని జులై 15 న విడుదలచేయాలని ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ