Advertisementt

రజిని రోబోకి టైమ్ పడుతుంది!

Sat 25th Jun 2016 03:31 PM
rajinikanth,robot 2,shankar,akshay kumar,robot sequel  రజిని రోబోకి టైమ్ పడుతుంది!
రజిని రోబోకి టైమ్ పడుతుంది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం దర్శకదిగ్గజం శంకర్‌.. రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీజాక్సన్‌లు కీలకపాత్రల్లో 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో2.0' చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రహ్మాన్‌ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 200కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మొదట వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఈ చిత్రంలో ఎంతో ప్రాధాన్యం ఉండటం, దాదాపు ఏడు విదేశీ సంస్ధలు ఈ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ను తీర్చిదిద్దనుండటంతో పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్‌ బాగా లేటవుతుందని భావించిన దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి పోస్ట్‌పోన్‌ చేసినట్లు సమాచారం. మొత్తానికి 'బాహుబలి-ది కనుక్లూజన్‌' చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదలకు సిద్దమవుతుండగా శంకర్‌ 'రోబో 2.0' సమ్మర్‌ నుండి వెనక్కు వెళ్లడం గమనార్హం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ