Advertisementt

హరీష్ శంకర్ నెక్స్ట్ హీరో పవన్ కాదు!

Fri 24th Jun 2016 09:46 PM
harish shankar,allu arjun,dil raju,harish shankar new movie confirmed  హరీష్ శంకర్ నెక్స్ట్ హీరో పవన్ కాదు!
హరీష్ శంకర్ నెక్స్ట్ హీరో పవన్ కాదు!
Advertisement
Ads by CJ

వరుస విజయాలతో దూసుకుపోతోన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా, మాస్ కథలను జనరంజకంగా తీసి బ్లాక్బస్టర్ హిట్స్ సాధించిన హరీష్ శంకర్ దర్శకత్వం లో, భారీ కుటుంబ కథా చిత్రాలను నిర్మించే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. 

ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్ - దిల్ రాజు కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుంది. హరీష్ శంకర్ - దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ కూడా 4 సంవత్సరాల తరువాత కుదరటం తో, ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడనున్నది. అటు అల్లు అర్జున్ కి, ఇటు హరీష్ శంకర్ కి శ్రీ వెంకటేశ్వర క్రెయేషన్స్ బ్యానర్ లో ఇది మూడవ చిత్రం కావటం విశేషం. 

భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ చిత్రాన్ని 2017 వేసవి సెలవుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు  నిర్మాత దిల్ రాజు తెలిపారు. 

'ఆర్య, పరుగు చిత్రాల అనంతరం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మా బ్యానర్ లో 7 సంవత్సరాల తరువాత చేస్తోన్న చిత్రం ఇది. అలాగే సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం విజయం తరువాత హరీష్ శంకర్ దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందం గా ఉంది.  బన్నీ ఇమేజ్ కి బాడీ లాంగ్వేజ్ కి పెర్ఫెక్ట్ గా సరిపడే కథ ను హరీష్ శంకర్ రెడీ చేశారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం'..అని నిర్మాత దిల్ రాజు అన్నారు. 

ఇతర ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ