Advertisementt

మహేష్‌ సెంటిమెంట్‌ మురుగదాస్ పై కూడా!

Fri 24th Jun 2016 05:56 PM
mahesh babu,ar murugadoss,sentiment,mahesh babu sentiment,1st day shooting  మహేష్‌ సెంటిమెంట్‌ మురుగదాస్ పై కూడా!
మహేష్‌ సెంటిమెంట్‌ మురుగదాస్ పై కూడా!
Advertisement
Ads by CJ

సినిమా పరిశ్రమలో ఒక్కోక్కరికి ఒక్కో సెంటిమెంట్‌ ఉంటుంది. కోట్లతో కూడిన బిజినెస్‌ కావడం, ఎవరి మనస్తత్వానికి తగ్గ సెంటిమెంట్‌ను వారు ఫాలో అవుతుంటారు. దీనిలో ఎవ్వరినీ తప్పుపట్టడానికి కూడా ఏమీలేదు. అయితే మహేష్‌కు ఓ సెంటిమెంట్‌ చాలా కాలంగా వస్తోంది. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ఆ సెంటిమెంట్‌ను మాత్రం మహేష్‌ ఫాలో అవుతూ ఉండటం విశేషం. ఆయన సినిమా షూటింగ్‌ మొదటిరోజు అసలు హాజరుకారు. అలాగే సినిమా పూజా కార్యక్రమాలకు సైతం ఆయన దూరంగా ఉంటాడు. 'అతడు, దూకుడు, ఆగడు, 1( నేనొక్కడినే), బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలకు ఆయన ఇదే రూట్‌ ఫాలో అయ్యారు. అదే సెంటిమెంట్‌ను మురుగదాస్‌ చిత్రానికి కూడా మహేష్ ఫాలో అవుతున్నాడు. అలాగే మే నెలలో మహేష్ చిత్రాలు విడుదలైతే డిజాస్టర్స్‌ అవుతాయనే నమ్మకం కూడా మహేష్‌కు బలంగా ఉంది. ఆ నెలలో విడుదలైన 'నిజం, నాని, బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దాంతో మహేష్ మురుగదాస్‌ చిత్రాన్ని మే నెలలో కాకుండా ఏప్రిల్‌లోనే అదీ 'పోకిరి' రిలీజ్‌ అయిన ఏప్రిల్‌ 28న విడుదల చేయాలని భావిస్తున్నాడని సమాచారం. మురుగదాస్‌ చిత్రం జులై 15న మొదలుకానుంది. మొదటిరోజు మహేష్‌ షూటింగ్‌లో పాల్గొనడం లేదు. మరి ఈ సెంటిమెంట్‌ మహేష్‌కు ఏమాత్రం కలిసొస్తుందో చూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ