తన 30 ఏళ్ల కెరీర్‌లో కామెడీ కింగ్‌గా ఎదిగిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. వాస్తవానికి స్టార్ హీరోలకు కొద్దిగా గ్యాప్ వచ్చినా, లేక వరుస ఫ్లాప్‌లు వచ్చినా తర్వాత మరలా ఒక్క సూపర్‌హిట్ వస్తే చాలు... పూర్వపు వైభవం వస్తుంది. కానీ హీరోయిన్లు, కమెడియన్‌ల విషయం అలా ఉండదు. కాస్త గ్యాప్ వచ్చినా, వరుస ఫ్లాప్‌లు వచ్చినా ఇండస్ట్రీలో లైమ్‌లైట్‌లోంచి బయటకు వెళ్లిపోతారు. కెరీర్ గాడి తప్పుతుంది. ఇక తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో అయితే కొత్త కమెడియన్లు, హీరోయిన్ల పోటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏమాత్రం అజాగ్రత్త వహించినా కూడా కెరీర్ చీకటిమయం అవుతుంది. నవ్వుల రారాజు బ్రహ్మానందం తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇక అతని పనైపోయింది అనుకున్న సమయంలో మరలా రీబౌన్స్ అయ్యారు. కేవలం తన కామెడీతోనే ఆయన ఎన్నో సినిమాలను నిలబెట్టారు. కానీ గత రెండేళ్లుగా ఆయన పరిస్దితి మారిపోయింది. యువ కమెడియన్ల రాకతో బ్రహ్మీని అందరూ పట్టించుకోవడం మానేశారు. ఒకప్పుడు ఆయన స్టార్ హీరో సినిమాల్లో లేకుంటే అందరూ ఆశ్చర్యపడేవారు. కానీ ఇప్పుడు ఆయన స్టార్ హీరో సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోతున్నారు. ఆయనపై చిన్నగా మొదలైన నెగటివిటీ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇండస్ట్రీలో ఎవ్వరూ బ్రహ్మీ గురించి ఆలోచించడం లేదు. పోయిన రెండేళ్లలో ఆయన కేవలం 'సర్దార్‌గబ్బర్‌సింగ్, సరైనోడు' చిత్రాల్లో నామ్ కె వాస్తేగా కనిపించారు.ఇక ఆ తరవాత వచ్చిన 'బ్రహ్మోత్సవం'లో అసలు కనిపించలేదు. ఇక 'అతడు' నుండి త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపించే ఆయన 'అ..ఆ'లో కూడా కనిపించలేదు. వాస్తవానికి ఆయనకు శ్రీనువైట్ల, త్రివిక్రమ్ వంటి దర్శకుల వల్ల మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. కానీ ఇప్పుడు వారు కూడా ఆయన్ను పక్కనపెట్టేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి బ్రహ్మీ కెరీర్‌కు డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి.