టీవీ9 చానెల్‌ను వేరే వారికి విక్రయిస్తున్నారనే వార్తలకు ఆ చానెల్ సీఈవో రవిప్రకాష్ ఫుల్‌స్టాప్ పెట్టారు. టీవీ9ను మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేస్తున్నారనే వార్త ఇటీవల హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను రవిప్రకాష్ ఖండించారు. ఆ వార్తలపై వ్యంగ్యమైన కామెంట్లు చేశారు. ఇప్పటికే టీవీ9 కొన్ని వందల సార్లు అమ్ముడుపోయిందని ఆయన సెటైర్ వేశారు. టీవీ9ను అమ్మడానికి మైహోం గ్రూప్‌తో ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులతో వ్యాపారపరమైన ఒప్పందాలు చేసుకోనని, అలా చేయడం అనైతికమని, మీడియా ఎప్పుడు రాజకీయాలకు దూరంగా స్వతంత్రంగా ఉండాలని ఆయన తన మనసులోని మాటను తెలిపారు. మొత్తానికి వ్యంగ్యంగా అన్నప్పటికీ రవిప్రకాష్ ఓ విషయాన్ని ఒప్పుకున్నట్లుగా మీడియా మిత్రులు అంటున్నారు. టీవీ9 వందల సార్లు అమ్ముడుపోవడం నిజమేనని వారు రవిప్రకాష్‌పై ద్వజమెత్తుతున్నారు. పత్రికల్లో తనే టాప్ గా ఉండాలని రామోజీరావు ఎలా ప్లాన్ చేసి ఈనాడు పత్రికను నడుపుతున్నాడో, చానెల్స్ మధ్య కూడా అనవసర కాంపిటీషన్‌ను క్రియేట్ చేసి తమ చానెల్‌ను నెంబర్‌వన్‌గా ఉంచడానికి మీడియా ఏమి చేయకూడదో.. అన్నింటిని చేసిందని, తమ రేటింగ్స్ కోసం ఎందరి వ్యక్తిగత విషయాలనైనా తన పబ్లిసిటీకి వాడుకొని చానెల్స్ మధ్య పెడ ధోరణులకు సాక్షిభూతం అయిందని సీనియర్ పాత్రికేయుల తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు.