Advertisementt

సరైన ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోన్న యంగ్‌ డైరెక్టర్‌..!

Thu 23rd Jun 2016 01:05 PM
anil ravipudi,kalyan ram patas movie,sai shram teja supreme movie,next ram,super planing  సరైన ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోన్న యంగ్‌ డైరెక్టర్‌..!
సరైన ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోన్న యంగ్‌ డైరెక్టర్‌..!
Advertisement
Ads by CJ

సాధారణంగా ఈమధ్యకాలంలో మొదటి సినిమా మంచి హిట్టు ఇచ్చిన దర్శకులు కూడా తమ రెండో సినిమా కోసం ఎంతో కాలం ఎదురుచూస్తున్నారు. ఒకేసారి మొదటి చిత్రం విజయాన్ని క్యాష్‌ చేసుకొని స్టార్‌హీరోల కోసం పడిగాపులు కాస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ అలా రెండో చిత్రమే స్టార్స్‌తో చేసినప్పటికీ వారికి ఉన్న క్రేజ్‌ను, ఇమేజ్‌ను బేరీజు వేయలేక ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నారు. అయితే యువదర్శకుడు అనిల్‌రావిపూడి మాత్రం ఒకేసారి ఆకాశానికి నిచ్చెన వేయకుండా మెట్టు మెట్టు ఎక్కుతున్నాడు. తనకు వచ్చిన అవకాశాలతో రాటుదేలుతూ సరైన రూట్‌లో ప్రయాణం సాగిస్తున్నాడు. తన మొదటి చిత్రాన్ని ఫ్లాప్‌ హీరో కళ్యాణ్‌రామ్‌తో 'పటాస్‌' చేసి హిట్టు కొట్టాడు. ఇక తన రెండో చిత్రంగా కళ్యాణ్‌రామ్‌ కన్నా బెటర్‌ పొజిషన్‌లో ఉన్న సాయిధరమ్‌తేజ్‌తో 'సుప్రీమ్‌' చేసి కమర్షియల్‌గా ఓకే అనిపించాడు. ఇక తన మూడో చిత్రాన్ని సాయి కంటే మరికాస్త మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో రామ్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ దర్శకుడు ఇలా మెట్టు మెట్టు ఎదగడం ఆయన కెరీర్‌కు ప్లస్‌ అయ్యే విధంగానే ఉండటం శుభపరిణామం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ