దేశం మొత్తంగా బిజెపి దాదాపు అన్ని రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షులను ఎంపిక పూర్తి చేసింది. తెలంగాణలో కూడా కిషన్‌రెడ్డి స్దానంలో లక్ష్మణ్‌ను నియమించింది. లక్ష్మణ్‌ను ఎంపిక చేసిన తర్వాత తెలంగాణలో బిజెపిలో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇటీవల జాతీయ అధ్యక్షడు అమిత్‌షా కూడా తెలంగాణలో పర్యటించి సభల్లో ప్రసంగించారు. కానీ రెండు నెలలు దాటుతున్నప్పటికీ ఏపీలో మాత్రం కంభంపాటి హరిబాబు స్దానంలో మరోకరిని నియమించలేదు. పార్టీ అధిష్టానంతో పాటు రాష్ట్ర బిజెపి నాయకుల్లో కూడా సోము వీర్రాజుకు ఆ పదవి ఇవ్వాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. కానీ ఆ పదవికి సోము వీర్రాజును కాకుండా తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తిని నియమించాలని చంద్రబాబు బిజెపి అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నాడట. తమపై, తమ పార్టీ వారిపై, చివరకు ముఖ్యమంత్రినైనా తనపై కూడా సోము వీర్రాజు తీవ్ర విమర్శలు చేస్తున్నాడని, అలాంటి వ్యక్తికి అధ్యక్షపదవి ఇస్తే రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతుందని బిజెపి అధిష్టానంపై బాబు ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఇక ఈ పదవి కోసం పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, చల్లపల్లి నరసింహారెడ్డిలు పోటీ పడుతున్నారు. వీరిలో పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ ఎంపికల పట్ల కూడా బాబు వ్యతిరేకంగా ఉన్నాడు. మొత్తానికి ఏపీకి బిజెపి అధ్యక్షుడుగా ఎవరు రానున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది.