కొరటాల శివ ఇప్పటికి రెండే రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్. కొరటాల దర్శకత్వం చేసిన చిత్రాలలో హీరోలు ఏదో ఒక ఆదర్శం కోసం పని చేస్తూ కనిపిస్తారు. మిర్చి లో ప్రభాస్ ని ఒక స్టూడెంట్ గా చూపించినప్పటికీ ప్రభాస్ తన తండ్రి కోసమే కొన్ని పనులు చేస్తూ అందరికి ఆదర్శంగా ఉంటాడు. ఇక శ్రీమంతుడులో మహేష్ బాబుని ఒక బిజినెస్ మెన్ గా చూపిస్తూనే ... ఒక ఊరి కోసం పాటుపడి ఆ ఊరి బాగు కోరే వ్యక్తి గా మహేష్ కేరెక్టర్ ని మలిచాడు. అంతే కాకుండా కొరటాల తన హీరోలను చాలా అందంగా, హుందాగా చూపిస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ, జూనియర్ ఎన్ఠీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం జనతా గ్యారేజ్ లో కూడా జూనియర్ ఎన్ఠీఆర్ ని రెండు డిఫ్రెంట్ షేడ్స్ లో వున్న పాత్రలుగా మలిచాడు, అందులో ఒకటి మాస్ ఎలివెంట్స్ వున్న పాత్ర కాగా... మరొకటి యువ ఇంజినీర్ గా చూపించాడు. యువ ఇంజినీర్ అయిన ఎన్ఠీఆర్ ఈ చిత్రంలో ప్రకృతి ప్రేమికుడిగా కనిపించనున్నాడట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ విషయంలో ఎన్ఠీఆర్ చాలా హ్యాపీ గా ఉన్నాడంట. అంతే కాదు వెంటనే మళ్ళీ కొరటాలతోనే మూవీ చేయాలి అనేంతగా కొరటాల పనితనం ఎన్ఠీఆర్ ని ఆకట్టుకుంటుందంట. ఈ జనతా గ్యారేజ్ కూడా తన రెండు సినిమాల్లాగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక కొరటాల శివ రేంజే మారిపోతుంది. అదే జరిగితే జూనియర్ ఎన్ఠీఆర్ 100 కోట్ల క్లబ్ కల కూడా నెరవేరినట్లే అవుతుంది.