Advertisementt

అఖిల్‌కు ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా....?

Wed 22nd Jun 2016 09:21 PM
akhil akkineni,sentiment,2nd movie,naga chitanya,ye maya chesave,jr ntr student no 1,allu arjun aarya,ram charan magadheera  అఖిల్‌కు ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా....?
అఖిల్‌కు ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా....?
Advertisement
Ads by CJ

తన మొదటి చిత్రాన్ని వినాయక్‌ దర్శకత్వంలో చేసిన అఖిల్‌కు ఆ చిత్రం భారీ డిజాస్టర్‌నే మిగిల్చింది. ఈ చిత్రం విడుదలై ఇంతకాలం అయినా ఆయన రెండో చిత్రంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. రేసులో హనురాఘవపూడి, వంశీపైడిపల్లి, కొరటాల శివ పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఏ విషయము ఇప్పటికీ అఫీషియల్‌గా అనౌన్స్‌ కాలేదు. కానీ అఖిల్‌తో పాటు ఆయన ఫ్యామిలీ, అక్కినేని ఫ్యాన్స్‌... అఖిల్‌ రెండో చిత్రం ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. టాలీవుడ్‌లోని పలువురు యంగ్‌స్టార్స్‌ తమ మొదటి చిత్రాలు పెద్దగా ఆడకపోయినా రెండో చిత్రంతో హిటునుకొట్టడాన్ని వారు సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు. ఎన్టీఆర్‌కు 'స్టూడెంట్‌ నెం.1', అల్లుఅర్జున్‌కు 'ఆర్య', నాగచైతన్యకు 'ఏమాయ చేశావే', రామ్‌చరణ్‌కు 'మగధీర'లాగా ఈ రెండో సినిమా సెంటిమెంట్‌ తమ అఖిల్‌కు కూడా బాగా కలిసొస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ