ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి2' చిత్రంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'బాహుబలి' గురించి తప్ప వేరే సినిమా గురించి ఆలోచించడం లేదు. కానీ ఈ చిత్రం తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రంపై అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా రాజమౌళి 'బాహుబలి2' తర్వాత మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి మహేష్-రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బేనర్‌లో కెఎల్.నారాయణ నిర్మించనున్నాడు. కానీ ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మరోవార్త హల్‌చల్ చేస్తోంది. అదేమిటంటే రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు చేయబోయే చిత్రం మల్టీస్టారర్ అని, ఇందులో మహేష్‌తో పాటు బాలకృష్ణ కూడా నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా దాసరి నారాయణరావుతో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దాసరి నిర్మాతగా బిజీ కావడానికి సన్నద్దం అవుతున్నాడని, పవన్‌తో దాసరి చేయబోయే చిత్రం అనంతరం ఆయన చిరుతో కూడా నిర్మాతగా ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. చిరు 151వ చిత్రంగా ఈచిత్రం రూపొందనుందని ఈ వార్తల సారాంశం. అయితే దీనిని చిరంజీవి సన్నిహితులు ఖండిస్తున్నారు. ఇక తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న'తని ఒరువన్' రీమేక్ 'ధృవ'లో చరణ్‌తో కాజల్ ఓ ఐటంసాంగ్‌లో నర్తించనుందని వార్తలు వచ్చాయి.అయితే అసలు ఈ సినిమాలో అలాంటి ప్రత్యేకమైన సాంగ్ ఏమీ లేదని సమాచారం.