ఉద్యోగుల బదిలీల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పత్తిపాటి పుల్లారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీల విషయంలో పారదర్శకత పాటించాలని ఆయన పత్తిపాటిపై మండిపడ్డాడట. గుంటూరుకు, విజయవాడకు ఎంత దూరం? వచ్చి మాట్లాడేంత తీరిక లేకుండా పోయిందా? అని విరుచుకుపడ్డాడు. మంత్రులు, సెక్రటరీలు, కలెక్టర్ల మద్య సమన్వయం కనిపించడం లేదని, ముందుగా మనలో మనమే కౌన్సిలింగ్ చేపట్టాల్సిన దురదృష్టకర పరిస్థితి వస్తోందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేతల్లో ఇగో సమస్యలు పెరగిపోయాయని, అంత ఇగోలు మీకెందుకు? అని ఆగ్రహంగా మాట్లాడి, పత్తిపాటికి హితవు పలికారని విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు ఆవేదనలో ఖచ్చితంగా వాస్తవం ఉంది. నాయకులకు ఇగోలు పెరగిపోతున్నాయి. ఎవ్వరి మద్య సమన్వయం ఉండటం లేదు. దీనిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టాలనే వాదన వస్తున్న తరుణంలో అదే అంశాన్ని చంద్రబాబు ఆచరణలో చూపడం సంతోషకరమైన విషయమే అని అందరూ హర్షిస్తున్నారు.