Advertisementt

ఎంఐఎం కి కేసీఆర్‌ భయపడుతున్నాడా!

Wed 22nd Jun 2016 12:07 PM
mim,kcr,trs,hyderabad,bjp,nda  ఎంఐఎం కి కేసీఆర్‌ భయపడుతున్నాడా!
ఎంఐఎం కి కేసీఆర్‌ భయపడుతున్నాడా!
Advertisement
Ads by CJ

అందరూ బిజెపిని మతతత్వ పార్టీ అంటారు కానీ అది ఎంత మాత్రము నిజం కాదు. మజ్లిస్‌ వంటి పార్టీ నేతలకే అది మతతత్వపార్టీ. నిజానికి ఎంఐఎం పార్టీని మించిన మతతత్వ పార్టీ ఇంకోటి ఉండదు. కానీ రాష్ట్రంలోని ముస్లింల ఓటు బ్యాంక్‌ కోసం తెలంగాణ సీఎం మజ్లిస్‌కు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నాడు. ఎన్డీఏలో చేరే అవకాశం ఉన్నప్పటికీ బిజెపి పంచన చేరితే  తమకు ముస్లిం ఓటు బ్యాంకు దూరమవుతుందని కేసీఆర్‌ భయపడుతున్నాడు. గ్రేటర్‌హైదరాబాద్‌లో అందరి ఓట్లతో ఘనవిజయం సాదించినా కూడా మజ్లిస్‌ అంటే ఉన్న భయం కేసీఆర్‌ను వదలడం లేదు. మజ్లిస్‌ నేతలను చేరదీస్తున్నాడు. ఆ పార్టీని పల్లెత్తు మాట అనడం లేదు. నిజానికి ఇప్పటివరకు పనిచేసిన సీఎంలలో మజ్లిస్‌ పట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రమే కఠినంగా వ్యవహరించాడు. వారి బెదిరింపులకు భయపడకుండా పనిచేసి సెహభాష్‌ అనిపించుకున్నాడు. మరి తెలంగాణలో ఇంత బలమైన కేసీఆర్‌ కూడా ఎన్డీఏలో చేరడానికి భయపడుతున్నాడంటే అసలు విషయం అర్దమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ