యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తొంభైలలో వచ్చిన సినిమా 'ఒకే ఒక్కడు'. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు, తమిళ బాషలలో ఘన విజయం సాధించింది. శంకర్ ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు. బాలీవుడ్ లో నాయక్ అనే పేరుతో విడుదలయిన ఈ సినిమా అక్కడ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అయితే త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి దీపక్ ముకుట్ అనే బడా నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారు. దాదాపు 17 ఏళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో గానీ, దానికి తగ్గట్లు కథను రెడీ చేస్తున్నారని మాత్రం తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ కథను సిద్ధం చేసే బాధ్యతలు తీసుకున్నారట. అయితే దర్శకుడు, నటీనటులెవరనే విషయాలు మాత్రం ఫైనల్ కాలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలను అధికారకంగా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి..!