మహేష్‌బాబు తాజాగా నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్‌గా చెప్పుకోవాలి. సినిమా విడుదలైన మొదటి షో నుండే ఈ చిత్రం చెత్త టాక్‌ను తెచ్చుకుంది. ఇలా మౌత్‌టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వెంటనే షెడ్డుకు పంపించారు. అయితే ఈ చిత్రం గురించి ఇటీవల టిఆర్‌ఎస్ ఎమ్మేల్యే బాలకిషన్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన వాస్తవమే మాట్లాడినప్పటికీ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న మహేష్ అభిమానులు బాలకిషన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇంతకీ బాలకిషన్ ఏమన్నారంటే... నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాను. ఈమధ్య ఓ సినిమా గురించి మంచిగా విని థియేటర్‌కు వెళ్లి క్యూలో నిలబడి టిక్కెట్ కొని మరీ సినిమా చూశాను. అదే బిచ్చగాడు'. అప్పుడే మహేష్‌బాబు 'బ్రహ్మోత్సవం' కూడా రిలీజ్ అయింది. అయితే 'బిచ్చగాడు' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మోత్సవం చేసుకుంటుంటే.. 'బ్రహ్మోత్సవం' మాత్రం కలెక్షన్లు లేక బిచ్చగాడిగా మిగిలిపోయింది అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన మహేష్ ఫ్యాన్స్ మాత్రం బాలకిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమా గురించి చెత్తగా రాసిన ఓ పత్రికపైకి కూడా మహేష్ ఫ్యాన్స్ దండెత్తిన సంగతి తెలిసిందే.