Advertisementt

మేకోవర్‌ అయిన వంశీ...!

Tue 21st Jun 2016 12:37 PM
sunil,jakkanna,vamsi krishna akella,jakkanna teaser.rajamouli name  మేకోవర్‌ అయిన వంశీ...!
మేకోవర్‌ అయిన వంశీ...!
Advertisement
Ads by CJ

ఇటీవలి కాలంలో సునీల్‌కు ఒక్క హిట్‌ కూడా లేదు. కనీసం యావరేజ్‌ కూడా లేదు. దాంతో ప్రస్తుతం ఆయన ఆశలన్నీ 'జక్కన్న' పైనే ఉన్నాయి. రాజమౌళి నిక్‌నేమ్‌ను పెట్టుకొని పబ్లిసిటీ రాబట్టుకోవడంలో బాగానే సక్సెస్‌ అయిన ఈ చిత్రం టీజర్‌ కూడా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 'రక్ష' సినిమాతో దర్శకునిగా పరిచయమైన వంశీకృష్ణ ఆకేళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ చిత్రంతో పోలిస్తే వంశీకృష్ణ బాగా మేకోవర్‌ అయినట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతోంది.ఈ టీజర్‌లో నవరసాలకు సరైన ఇంపార్టెన్స్‌ కనిపిస్తోంది. కాకపోతే సునీల్‌ దారిలోకి వచ్చిన వంశీ అన్ని రసాలకంటే ఎక్కువగా హాస్యానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపిస్తోంది. ఇక ఈచిత్రంలో సునీల్‌కు, మన్నార్‌చోప్రాల మధ్య స్క్రీన్‌ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందనే కామెంట్స్‌ వస్తున్నాయి. అదే సమయంలో ఈ 'జక్కన్న'పై ఇండస్ట్రీలో కూడా మంచి పాజిటివ్‌ బజ్‌ ఏర్పడటం ఈ చిత్ర యూనిట్‌కు సంతోషం కలిగిస్తోంది. మరి ఈ చిత్రమైనా సునీల్‌కు, వంశీకృష్ణ ఆకేళ్లలకు బ్రేక్‌నిస్తుందో లేదో చూడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ