దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ రెండు పరస్పర విరుద్దమైన ఫలితాలను చవిచూశారు. గత ఏడాది అల్లరి నరేష్‌కు 'బందిపోటు' వంటి దారుణమైన ఫ్లాప్ ఇస్తే నానికి జంటిల్‌మన్ వంటి హిట్ ఇచ్చారు.
'బందిపోటు' నరేష్ సొంత చిత్రం. ముచ్చటపడి అన్నయ్య ఆర్యన్ రాజేష్‌ను నిర్మాతను చేస్తూ తండ్రి సొంతబేనర్‌పై తీశారు. 'బందిపోటు' ఏవరేజ్ ఫలితం కూడా సాధించలేకపొయింది. దీనివల్ల నరేష్ కుటుంబానికి దాదాపు పది కోట్ల నష్టం వచ్చింది. ఇంతటి దారుణమైన ఫలితాన్ని ఎవరూ ఊహించలేదు. మేథావి వర్గానికి చెందిన ఇంద్రగంటి తమని గట్టెక్కించకపోగా అప్పుల్లోకి నెట్టారని ఇవివి కుటుంబ బాథపడింది. 'బందిపోటు' ఫ్లాప్ వల్ల నరేష్ కెరీర్ సైతం గందరగోళంలో పడింది. నరేష్‌కు మరిన్ని ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ, సొంత సినిమా పోవడం వల్ల ఇబ్బందిపడ్డారు.
అదే ఇంద్రగంటి హీరో నానికి 'జంటిల్‌మన్'తో హిట్టిచ్చారు. నాని హ్యాట్రిక్ విజయం సాధించేలా చేశారు. కథ అరువుది కావడం వల్ల 'జంటిల్‌మన్' విజయం సాధించింది అనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ, ఇంద్రగంటి కృషి గురించి కూడా చెప్పుకోవాలి. సరైన కథ లభిస్తే ఆయన కూడా కమర్షియల్ హిట్ తీయగలను అని నిరూపించుకున్నారు.