యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రిమూవీ మేకర్స్ సంస్ద నిర్మిస్తున్న 'జనతాగ్యారేజ్' చిత్రం ఎలాంటి హడావుడి లేకుండా లోప్రొఫైల్‌లో షూటింగ్ జరుపుకుంటున్నప్పటీకీ ఇప్పటివరకు ఎన్టీఆర్ కెరీర్‌లో ఏ సినిమాకు లేని విధంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బిజినెస్ హాట్‌కేకుల్లా జరుగుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొదట ఈ చిత్రం ఆడియోని అమెరికాలోని న్యూజెర్సీలో విడుదల చేయాలని భావించిన మేకర్స్ ఇప్పుడు మనసు మార్చుకున్నారు. అమెరికాలో అయితే ఆడియోకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం కష్టం అని భావించిన నిర్మాతలు జులై 25న ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను గ్రాండ్‌గా హైదరాబాద్‌లోనే జరిపేందుకు సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం ఆగష్టు 12న విడుదల కానుంది. ఆడియో విడుదల రోజునే థియేటికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాతి వారం సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇలా స్లోగా ప్రమోషన్‌ను స్టార్ట్ చేసి పీక్స్‌కు తీసుకొని వెళ్లేలా పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారు.