ఏపీలో జనాభా సంఖ్య తగ్గిపోతుండటం బాబుకు ఆవేదన కలిగిస్తోంది. ముఖ్యంగా చదువుకున్న యువత పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపిస్తుండకపోవడంతో భవిష్యత్తులో యువతరం సంఖ్య తగ్గిపోతుందనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోంది. రాష్ట్రంలో జనాభా తగ్గిపోవడానికి కారణం చదువుకున్న యువత స్వార్ధపూరితంగా ఆలోచించడమే కారణం అని బాబు అభిప్రాయం. చదువుకున్న వారు పిల్లల్ని కనడానికి ఆసక్తిచూపకపోవడం లేదా ఒక్కరితో చాలని సరిపెట్టుకోవడం తగదని హితవు పలుకుతున్నాడు చంద్రబాబు. ఇప్పటికే అధిక జనాభాతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది ఇండియా. పిల్లల మీద పిల్లలను కనడం, కుటుంబనియంత్రణ పాటించకపోవడం వంటి కారణాలు.. మరీ ముఖ్యంగా మన దేశంలో పౌరుల జీవనప్రమాణాలు రోజురోజుకూ తరిగిపోతుండటం, పౌష్టికాహారలోపం, నిరక్షరాస్యులు ఎక్కువ మంది పిల్లలను ఎక్కువగా కనడం పట్ల అందరూ ఆందోళచెందుతున్న సమయంలో బాబుగారు ఇలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం తప్పని కొందరు విశ్లేషిస్తున్నారు. ఆ మధ్య కూడా బాబు గారు తనకు చెందిన సామాజికవర్గం వారు జనాభా పెంచడానికి కృషి చేయాలని ఉచిత సలహా పడేశారు. ఇంతకీ బాబు బాధ రాష్ట్ర జనాభా తగ్గడం వల్లా లేక తమ సామాజిక వర్గం ఓట్లు, వారి ఓటుబ్యాంకు తక్కువగా ఉండటం వల్లనా? అనేది అర్ధం కాని విషయం. తమ సామాజిక వర్గం వారు ఓటుబ్యాంకును పెంచుకొని రాష్ట్రంలో కీలకంగా మారాలని ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక రెండోవైపు ఆల్‌రెడీ తమ సామాజిక వర్గం వారు ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్దిరపడటం వల్ల కూడా వారి ఓటు బ్యాంకు తక్కువ కావడానికి కారణం అనేది బాబు భావన. అదే స్వర్గీయ ఎన్టీఆర్‌ను చూడండి. కుటుంబనియంత్రణ గట్టిగా అమలవుతున్న సమయంలో అంటే సంజయ్‌గాంధీ హయాంలో ఎన్టీఆర్ ఎంత మంది పిల్లల్ని కన్నాడో? అలాగే కుటుంబ నియంత్రణను తప్పుపడుతూ 'తల్లా...పెళ్లామా' చిత్రంలో చూపించి ప్రజలను రెచ్చగొట్టాడు. ఇక బాబు గారు మాత్రం ఎందుకనో కారణం తెలియదు కానీ జనాభా విషయంలో ఇంతలా ఆలోచిస్తున్న ఆయన కూడా ఒకే సంతానంతో సరిపెట్టుకున్నాడు. మరి ఆయన తన కొడుకు నారా లోకేష్ చేత కుటుంబనియంత్రణ పాటించకుండా ఎంతమందిని కనిపిస్తాడో చూడాల్సివుంది..!