Advertisementt

మరోసారి దాసరి-చిరు వార్‌!

Mon 20th Jun 2016 08:10 AM
dasari narayana rao,chiranjeevi,kaapu reservation issue,chiru vs dasari  మరోసారి దాసరి-చిరు వార్‌!
మరోసారి దాసరి-చిరు వార్‌!
Advertisement
Ads by CJ

'కాపునాడు' దాసరి నారాయణరావుకు, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య అభిప్రాయభేదాలు ఎప్పటి నుండో ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు మాత్రం దాసరి తనకు చిరుపై కోపం లేదని, తన బిడ్డలాంటివాడనీ, బిడ్డపై తండ్రికి ఎందుకు కోపం ఉంటుంది? అని ఓదార్పు మాటలు చెబూతూ వస్తున్నాడు. కానీ అవకాశం వచ్చినప్పుడల్లా దాసరి.. చిరును ఎంతగా చులకన చేసి మాట్లాడాలో అంతగా మాట్లాడుతూ ఉంటాడు. సెటైర్లు వేస్తుంటాడు. కానీ వీరిద్దరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం విషయంలో కలిసిపోయినట్లు కనిస్తున్నారు. కానీ వారిద్దరు కలవలేదని,కాపుల విషయంలో వీరిద్దరు తమ పెత్తనం, తమ మాట నెగ్గాలనే పట్టుదలతో ముందుకు వెళ్తుండటం వల్ల వీరిమధ్య విబేధాలు మరోసారి నివ్వురుగప్పిన నిప్పులా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవిని వెంటేసుకొని మీడియా ముందు దాసరి హడావుడి చేస్తున్నప్పటికీ ఈ కాపు సమావేశాల్లో చిరంజీవి ప్రాధాన్యం కోల్పోతూ వస్తున్నాడు. కాపు నాయకులను తన గుప్పిట్లో పెట్టుకోవడంలో చిరు కంటే దాసరే ఎక్కువగా విజయం సాధించాడు. ఆయన త్వరలో తిరిగి వైసీపీ ద్వారా రాజకీయ రీఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. దాంతో దాసరికి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు దాసరి చెప్పినట్లు నడుచుకుంటూ చిరు ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ నుండి పళ్లంరాజు వంటి వారు దాసరి గ్రూప్‌లో చేరిపోయారు. చివరకు చిరంజీవి, రామచంద్రయ్యలు మాత్రమే ఒంటరిగా మిగులుతున్నారు. ఇవ్వన్నీ పక్కనపెడితే చిరంజీవి అభిమానులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. తన 150వ చిత్రం చేస్తున్న సమయంలో చిరు అందరివాడులా ఉండాలి..కానీ ఆయన కాపు నాయకుడిగా ముద్ర వేయించుకొంటే ఆ ప్రభావం చిరు 150వ చిత్రం విజయంపై ప్రభావం చూపిస్తుందనే ఆందోళనలో మెగాభిమానులు ఉన్నారు. ఇలా చూసుకుంటే సినిమా లేదా రాజకీయం అంటూ ఒకే పడవపై ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నిర్ణయమే కరెక్ట్‌ అనే భావన వస్తోంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ