వాస్తవానికి టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వచ్చే సినిమా అంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక మురుగదాస్ సినిమా అంటే కూడా అంతే. అటువంటిది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ఇక అంచనాలు ఎంత భారీగా ఉంటాయో ఊహించుకోవచ్చు. కాగా ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం బడ్జెట్ 90కోట్ల లోపు అని వార్తలు వస్తున్నప్పటికీ ఈ చిత్రానికి ఇంకా భారీ బడ్జెట్‌ను పెట్టనున్నారని సమాచారం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఆరు పెద్ద పెద్ద నిర్మాణసంస్థలే రంగంలోకి దిగాయని సమాచారం. ఎన్వీప్రసాద్, ఠాగూర్‌మధుల పేర్లు నిర్మాతలుగా వినిపిస్తున్నప్పటికీ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, లియో ప్రొడక్షన్స్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్, మురుగదాస్‌తో టైఅప్ అయిన ఫాక్స్‌స్టార్ స్టూడియోస్, మహేష్ సొంత నిర్మాణ సంస్ద అయిన ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ సంస్దలు ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకోనున్నాయి. మొత్తం మీద మహేష్-మురుగదాస్‌ల కాంబినేషన్‌లోని సినిమాపై చాలా నిర్మాణ సంస్ధలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి.